మద్దతు ధర కల్పించాలి
ABN , First Publish Date - 2020-04-21T09:30:14+05:30 IST
రాష్ట్రంలో ఉద్యాన పంటలకు మద్దతు ధరకల్పించాలని టీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్

పసుపు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం
టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి
హుజూర్‌నగర్ రూరల్, నేరేడుచర్ల, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఉద్యాన పంటలకు మద్దతు ధరకల్పించాలని టీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్, నేరేడుచర్లలో హమాలీలు, ఆటో కార్మికులు, ఆశా ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, పోలీసు, రెవెన్యూ సిబ్బందికి అన్నదానం, నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పసుపు రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. రాష్ట్రంలో రూ.500కోట్ల విలువైన బత్తాయి పంట పండిందని, బత్తాయి, మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాల్లో విక్రయించే అవకాశం రైతులకు కల్పించాలన్నారు.
వలస కూలీలకు తగిన సహాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలకు 5కిలోల బియ్యం, రూ.500 నగదు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఇవ్వడం లేదన్నారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం కారణంగా రైతులు మిల్లుల వద్ద రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోందన్నారు. కార్యక్రమాల్లో తన్నీరు మల్లిఖార్జున్ రావు, సాముల శివారెడ్డి, నూకల సందీ్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.