పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం

ABN , First Publish Date - 2020-12-20T05:03:18+05:30 IST

చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని జలశక్తి అభియాన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ రవీంద్ర బోహార్‌ అన్నారు.

పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ అభినందనీయం
చౌటుప్పల్‌లో సమావేశంలో పాల్గొన్న రవీంద్ర బోహార్‌

చౌటుప్పల్‌ టౌన్‌, డిసెంబరు 19: చౌటుప్పల్‌ మునిసిపాలిటీలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అభినందనీయమని జలశక్తి అభియాన్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ రవీంద్ర బోహార్‌ అన్నారు. చౌటుప్పల్‌ మునిసిపాలిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం ఆయన పర్యటించారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజుతో సమావేశమయ్యారు. సమీక్షలో చంద్రశేఖర్‌, మురళీ, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.


పథకాలను సక్రమంగా అమలు చేయాలి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు చేయాలని రవీంద్ర బోహార్‌ అన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌, చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం గ్రామాల్లోని కంపోస్ట్‌ యార్డులను పరిశీలించారు. వీలైనంత త్వరగా ఎరువు తయారీ చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో పోచంపల్లి ఎంపీడీవో ఎ.బాలశంకర్‌, సర్పంచ్‌ పర్నె రజిత మల్లారెడ్డి, ఎంపీవో మాజిద్‌, సర్పంచ్‌ వెల్వార్తి యాదగిరి, ఉపసర్పంచ్‌ మల్కాజిగిరి కృష్ణ,  గ్రామపంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read more