మీడియా ప్రతినిధుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-04-05T10:07:24+05:30 IST

కరోనా వైరస్‌ నేపథ్యంలో పోలీసులు, డాక్టర్లతో పాటు మీడియా మిత్రుల సేవలు అభినందనీయమని ఐఎంఏ నీలగిరి

మీడియా ప్రతినిధుల సేవలు అభినందనీయం

నల్లగొండటౌన్‌, ఏప్రిల్‌ 4: కరోనా వైరస్‌ నేపథ్యంలో పోలీసులు, డాక్టర్లతో పాటు మీడియా మిత్రుల సేవలు అభినందనీయమని ఐఎంఏ నీలగిరి అధ్యక్షుడు డాక్టర్‌ ఏసీహెచ్‌ పుల్లారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవన్‌లో శనివారం ఐఎంఏ నీలగిరి, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా, వీడియో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్క్‌లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో డాక్టర్లు మూర్తి, జయప్రకా్‌షరెడ్డి, అనితారాణి, రమేష్‌, కామేశ్వర్‌, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం జిల్లా అధ్యక్షుడు దూసరి కిరణ్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T10:07:24+05:30 IST