పాలకులకు కనువిప్పు కలిగే తీర్పు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-09-20T09:17:30+05:30 IST
నల్లగొండ-ఖమ్మం- వరంగల్ నియోజకవర్గంలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో పాలకులకు కనువిప్పు కలిగే తీర్పు ఇవ్వాలని ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కోరారు...

నల్లగొండ టౌన్, సెప్టెంబరు 19 : నల్లగొండ-ఖమ్మం- వరంగల్ నియోజకవర్గంలో జరగబోయే పట్టభద్రుల ఎన్నికల్లో పాలకులకు కనువిప్పు కలిగే తీర్పు ఇవ్వాలని ఇంటి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకు సుధాకర్ కోరారు. శనివారం ఆయన కవి, రచయిత వేణు సంకోజుతో కలిసి జిల్లాకేంద్రంలో మండలి ఎన్నికల ప్రచార కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరుకు సుధాకర్ మాట్లాడుతూ తన ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ సమాజం కోసమే నిలబడుతానన్నారు. తెలంగాణ రాష్ట్ర అనంతరం సకల వ్యవస్థలను భష్ర్టు పట్టిస్తున్నందునే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు తెలిపారు. డోకా తిన్న తెల ంగాణ సదస్సు తరహాలో తెలంగాణలో నూతన మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నానన్నారు. ప్రతి ఎన్నికల్లో తామే ప్రశ్నించే గొంతులమని ప్రచారం చేసుకుంటూ ఆధిపత్య కులాల వాళ్లే ముందుకు వస్తున్నారని ఇది ఎన్నికల వరకే పరిమితం చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ ఉద్య మ ద్రోహులకు పట్టం కడుతున్నారనే ఉద్దేశంతో బయటకు వచ్చి పోరాడుతున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగులు, మేధావులు, ఉద్యోగులు, సకల జనులు అండ గా ఉంటారన్న నమ్మకం ఉందన్నారు. పట్టభధ్రులు, మేధావులుగా నిజాయితీగా పోరాడే వారికి పట్టం కడితే భవిష్యత్ రాజకీయాల్లో భయమనేది ఏర్పడుతుందన్నారు. కోదండరామ్‌కు గతంలో ఐక్యకార్యచరణ సమయంలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పోటీలో ఉంటామని చెప్పామన్నారు.
ఆ మేరకు ఆయన నిలిపిన అభ్యర్థులకు స్థానిక ఎన్నికల్లో ప్రచారం చేశామని కానీ ఇప్పుడు ఆయన ఎందుకో మనసు మార్చుకున్నారన్నారు. అనేక రకాలుగా నష్టపోయిన తన అభ్యర్థిత్వాన్ని ఈ ఎన్నికల్లో బలపర్చాలని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా నన్నారు. వేణుసంకోజు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు నిధులు మాత్రమే కనబడుతున్నాయని, ప్రజలుగాని, ప్రజా ఆకాంక్షలు కనబడడం లేదన్నారు. ఇది సరైన పద్ధతి కాదని రాజకీయాల్లో మార్పు రావాలని కోరారు. ఇంటి పార్టీ అధ్యక్షుడు సందీప్ చమర్, ఎస్కే.చాంద్, చింతమల్ల వెంకటేష్, టీఎ్సయూ జిల్లా అఽధ్యక్షుడు కొండేటి మురళీధర్, జిల్లా సంపత్, పల్లె సాయికుమార్, కత్తుల జయచందనరాజు, మధు తదితరులు పాల్గొన్నారు.