ఘనంగా హనుమత్‌ వ్రతం

ABN , First Publish Date - 2020-12-28T05:23:08+05:30 IST

జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి దేవాలయం, వేదాంతభజనమందిరంలో హనుమత్‌ వ్రతం ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా హనుమత్‌ వ్రతం
సూర్యాపేటలోని భక్తాంజనేయస్వామి దేవాలయంలో పూజలు చేస్తున్న భక్తులు

సూర్యాపేట కల్చరల్‌/ అర్వపల్లి/ మఠంపల్లి, డిసెంబరు 27: జిల్లా కేంద్రంలోని భక్తాంజనేయస్వామి దేవాలయం, వేదాంతభజనమందిరంలో హనుమత్‌ వ్రతం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు దరూరి రామానుజాచార్యులు, సింగరాచార్యులు స్వామివారికి ప్రత్యేక ఆలంకరణలతో పంచామృతాభిషేకాలు, హనుమాన్‌ చాలీసా పారాయణం, తమలపాకులతో సహస్ర నామార్చన, వెండి తమలపాలకులతో అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాలయ ఫౌండర్‌ మెంబర్‌ కొత్తా ఆంజనేయులు, ఈవో రంగారావు, మొరిశెట్టి శ్రీనివాస్‌, గండూరి రమేష్‌, రాచర్ల వెంకటేశ్వర్‌రావు, నకిరేకంటి రాజశేఖర్‌, అశోక్‌, రామూర్తి, బోనగిరి వెంకటేశ్వర్లు, దరూరి శ్రీధరాచార్యులు, శ్రీనాథచార్యులు, రాఘవాచార్యులు పాల్గొన్నారు. అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్స వాల్లో భాగంగా మహిళలు కుంకుమార్చన నిర్వహించారు. మఠంపల్లి మండ లం గుర్రంబోడుతండా, కృష్ణాతండా, కాల్వపల్లితండా, దొనబండతండా, సుల్తాన్‌పురంతండాల్లో ఆంజనేయ మాలధారుల ఇరుముడి నిర్వహించారు. 

Updated Date - 2020-12-28T05:23:08+05:30 IST