రైతుల హక్కులను కాపాడాలి
ABN , First Publish Date - 2020-09-16T07:19:33+05:30 IST
గిరిజన రైతుల హక్కులు కాపాడాల ని; సాగులో ఉన్న ప్రతి రైతుకూ పట్టా ఇవ్వాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్

తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం
మఠంపల్లి, సెప్టెంబరు 15: గిరిజన రైతుల హక్కులు కాపాడాల ని; సాగులో ఉన్న ప్రతి రైతుకూ పట్టా ఇవ్వాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. సూర్యాపే ట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంబోడుతండాలోని సర్వేనంబర్ 540లో గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ముంపు బాధితులకు గుర్రంబోడుతండాలో పునరావాసం కింద పోడు భూములు ఇచ్చి, వాటిని చూపలేని, కొందరికి పట్టాలు, మరికొందరికి డీ-ఫాంలు ఇచ్చి సరిపెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. అప్పటి నుంచి గిరిజనులు అష్టకష్టాలుపడి భూములు సాగు చేసుకుంటున్నారని అన్నారు.
చాలామందికి నేటికీ పట్టాలు లేవని, డీ-ఫాంలు కూడా పది మందికి కలిపి ఇచ్చారన్నారు. 540 సర్వేనంబర్‌లో 6,239 ఎకరాల భూమి ఉంటే 13, 678 ఎకరాలకు పట్టాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. పాలకులు, అధికారుల తప్పిదాల కారణంగానే అక్రమాలు జరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెం దిన బడా వ్యాపారికి వందల ఎకరాలకు ఎలా పట్టాలు ఇచ్చారని ప్రశ్నించారు. ఇటీవల గిరిజనులపై దాడులు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. త్వర లో ఈ ప్రాంతంలో పాదయాత్ర చేసి పూర్తి వివరాలతో కలెక్టర్ ను కలుస్తానన్నారు. ఆయన వెంట టీజేఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మార్జున్, నియోజకవర్గ కన్వీనర్ దొంతిరెడ్డి శ్రీనివా్‌సరెడ్డి, పీడీఎ్‌సయూ జిల్లా కార్యదర్శి బిక్షంనాయక్, న్యాయవాదులు పాల్గొన్నారు.
కలిసొచ్చే పార్టీలతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ
హుజూర్‌నగర్, సూర్యాపేటటౌన్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసొచ్చే పార్టీలతో కలిసి పోటీ చేస్తామని కోదండ రాం తెలిపారు. హుజూర్‌నగర్, సూర్యాపేటలో విలేకరులతో మాట్లాడుతూ, ఖమ్మం-నల్లగొండ-వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా తాను పోటీ చేసే అంశంపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఇతర రాజకీ య పార్టీలను కోరినట్లు తెలిపారు. ప్రైవేట్ ఉపాధ్యాయుల చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరో నా విపత్కర సమయంలో బతుకుదెరువు కోల్పోయిన ప్రతీ ఒక్కరిని ఆదుకోవాలన్నారు. వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేస్తే ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తే నిరుద్యోగులకు ఆవకాశాలు దూరమవుతాయన్నారు.
నిరుద్యోగభృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎ్‌సతో పేదల సొంతింటి కలకు విఘాతం కలుగుతుందన్నారు. ఎల్‌ఆర్‌ఎ్‌సపై ఈ నెల 21వ చేపట్టనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యానికి ఇటీవల అసెంబ్లీ సాక్షిగా ఆత్మహత్య చేసుకున్న నాగులు ఉదంతం నిదర్శనమన్నారు. హుజూర్‌నగర్‌లో తమ సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని కోదండరాం ను ప్రైవేట్ ఉపాధ్యాయులు, అధ్యాపకులకు సంఘం నాయకు లు కలిసి వినతిపత్రం అందజేశారు. కోదండరాం వెంట వెంకటరెడ్డి, చందర్‌రావు, రమాశంకర్, మోహన్‌రెడ్డి ఉన్నారు.