జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

ABN , First Publish Date - 2020-10-03T10:45:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేటటౌన్‌ / కోదాడ టౌన్‌ /హుజూర్‌నగర్‌ రూరల్‌/ నేరేడు చర్ల, అక్టోబరు 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. జిల్లాకేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా విపత్కర సమయంలో జర్నలిస్టులు ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా సమాచార సేకరణ చేశారన్నారు. కరోనా చనిపోయిన జర్నలిస్టులకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు.


కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నేషనల్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మిక్కిలినేని శ్రీనివా్‌సరావు, బంటు కృష్ణ,విజయ్‌కుమార్‌, జనార్థనాచారి, తండు నాగేందర్‌, ధనియాకుల వెంకటేశ్వర్లు, మల్లిఖార్జున్‌, కందుల నాగరాజు, రణబోతు శ్రీనివా్‌సరెడ్డి, వడ్డె వెంకయ్య, కృష్ణయ్య, సైదులు పాల్గొన్నారు. కోదాడలో జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే(ఐజే యూ) నాయకుడు గింజల అప్పిరెడ్డి, బాదె రాము, హరినాథ్‌, సత్యనారాయణ, గోపి, వెంకటేష్‌, రవిచంద్ర, నవీన్‌ పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో కరోనాతో ఇబ్బంది పడ్డ జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవాలని టీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి కోల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. జర్నలిస్టుల నిరసనకు సీపీఐ, పలు కార్మిక సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో టీవీఎల్‌, దయాకర్‌రెడ్డి, రాంప్రసాద్‌గౌడ్‌, పిల్లలమర్రి శ్రీనివాసు, పండ్ల నాగరాజు, చిట్టిపోతుల రమేష్‌ పాల్గొన్నారు. నేరేడుచర్లలో గాంధీ విగ్రహానికి జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జర్నలిస్టులు టీఎన్‌స్వామి, అలుక సైదిరెడ్డి, సురేష్‌, యుగంధర్‌, వీరయ్య, సుధాకర్‌, శ్రీను, శంకర్‌, శ్రవణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T10:45:36+05:30 IST