మహోన్నత వ్యక్తి నర్సింహయ్య

ABN , First Publish Date - 2020-12-28T06:10:05+05:30 IST

అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడి, వారికే జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి నోముల నర్సింహయ్య అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు.

మహోన్నత వ్యక్తి నర్సింహయ్య
నర్సింహయ్య చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

నర్సింహయ్య సంతాప సభలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌

నోముల భగత్‌కు టికెట్‌ ఇవ్వాలని సభ తీర్మానం


నల్లగొండ క్రైం, డిసెంబరు 27: అణగారిన వర్గాల అభ్యున్నతికి పోరాడి, వారికే జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి నోముల నర్సింహయ్య అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. యాదవ జిల్లా మహాసభ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల మైదానంలో ఆదివారం రాత్రి నిర్వహించిన నోముల నర్సింహయ్య సంతాప సభలో ఆయన మాట్లాడారు. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని రాజకీయంగా ఎదిగారన్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజాసమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కా రానికి కృషి చేశారని కొనియాడారు. జిల్లాలో రాజకీయం చేయడమంటే మామూలు విషయం కాదని, అది 30-35 ఏళ్లు రాజకీయాల్లో సుదీర్ఘంగా రాణించగలగడం ఆయనకే సాధ్యమైందన్నారు.  కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ మాట్లాడుతూ, నర్సింహయ్యతో కలిసి పనిచేసే అదృష్టం తనకు దక్కడం సంతోషంగా ఉన్నా, ఆయన లేని లోటు రాష్ర్టానికి, పేద ప్రజలకు తీర్చలేనిదన్నారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ మాట్లాడుతూ నో ముల నర్సింహయ్య అందరితో కలివిడిగా ఉం డి ప్రేమానురాగాలను పం చేవారని గుర్తు చేశారు. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌ మాట్లాడుతూ, నాన్న ఆశయ సాధనకు నిరంతరం కష్టపడతానన్నారు. నోముల భగత్‌ను సాగర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించాలని కొంతమంది కార్యకర్తలు నినాదాలు చేసి నిరసన తెలిపే ప్రయత్నం చేయటంతో; భగత్‌కు టికెట్‌ ఇవ్వాలని సభ తీర్మానించింది. ఈ తీర్మానాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతామనని ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు లొడంగి గోవర్దన్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో నోముల సతీమణి లక్ష్మి, కుటుంబసభ్యులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:10:05+05:30 IST