యువకుడి అనుమానాస్పద మృతి
ABN , First Publish Date - 2020-03-16T12:12:11+05:30 IST
నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఓ యు వకుడు ఆదివారం సాయం త్రం వ్యవసాయ బావి వద్ద
శాలిగౌరారం, మార్చి 15: నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన ఓ యు వకుడు ఆదివారం సాయం త్రం వ్యవసాయ బావి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఊట్కూరు గ్రామానికి చెందిన గోవింద రాజు(25) శాలిగౌరారం స్త్రీశక్తి భవనంలో మూడేళ్లుగా కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలోని కొంత భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఆదివారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లినరాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాజు మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని గ్రామస్థుల చెబుతున్నారు. మృతుడికి భార్య రజిత, ఏడాది కుమారుడు ఉన్నారు. రాజు మృతి పట్ల ఏపీఎం జానకి, ఊట్కూరు సర్పంచ్ వేముల లింగయ్య, సమభావన సంఘాల ప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.