విదేశీయులను పరామర్శించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-24T11:56:04+05:30 IST

జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వియత్నాం దేశస్థులను ఎమ్మెల్యే కంచర్ల

విదేశీయులను పరామర్శించిన ఎమ్మెల్యే

నల్లగొండ అర్బన్‌, మార్చి 23:  జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉన్న వియత్నాం దేశస్థులను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి సోమవారం పరమార్శించారు. వియత్నాం దేశస్థులను పలకరించి వారికి అందుతున్న వైద్య చికిత్సలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల వియత్నాం దేశస్థులు 12 మంది వారితో పాటు ఇద్దరు ఢిల్లీవాసులు జిల్లా కేంద్రానికి వచ్చారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు తరలించారు.


కరోనా లక్షణాలు లేకపోడంతో జిల్లా కేంద్రానికి తీసుకువచ్చి ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో చేర్పించారు. క్యారంటైన్‌ పీరియడ్‌ ముగిసే వరకు వారు ఇక్కడే ఉండనున్నారు. వారిని ఎమ్మెల్యే పరామర్శించారు. అనంతరం ఆస్పత్రిలో పర్యటించిన ఎమ్మెల్యే రోగలను పరామర్శించి వైద్యచికిత్సల గురించి అడిగి తెలుసుకున్నారు. ఐసీయూ, డయాసిస్‌ యూనిట్‌, నూతనంగా కరోనా రోగుల కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌ వార్డులను పరిశీలించారు. ఆయన వెంట ము నిసిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ మందుల నర్సింహ, డాక్టర్‌ పుల్లారావు ఉన్నారు. 

Read more