ఆకలి తీరింది

ABN , First Publish Date - 2020-04-07T09:56:53+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ గ్రామానికి వెళ్తూ తిరుమలగిరిలో చిక్కుకుపోయిన గుంటూరు జిల్లా వినుకొండ వాసి సుబ్బులింగం

ఆకలి తీరింది

తిరుమలగిరి : లాక్‌డౌన్‌ నేపథ్యంలో తమ గ్రామానికి వెళ్తూ తిరుమలగిరిలో చిక్కుకుపోయిన గుంటూరు జిల్లా వినుకొండ వాసి సుబ్బులింగం కుటుంబానికి తిరుమలగిరి  రైస్‌మిల్‌ ఓనర్‌  అసోసియేషన్‌ ప్రతినిధులు ఆకలి తీర్చారు. ‘ఒక్కపూటే తింటున్నాం’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి ’లో ప్రచురితమైన కథనానికి రైస్‌ మిల్‌ అసో సియేషన్‌ ప్రతినిధులు స్పందించారు. 50కేజీల బియ్యం, రూ. వెయ్యి నగదు అందజేశారు. రైస్‌మిల్లర్స్‌ ప్రతినిధులకు ఆ కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌, ఇమ్మడి సోమనర్సయ్య, తాటిశెట్టి రమేష్‌, పాలెపు లక్ష్మయ్య, గబ్బెట శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more