ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T04:34:08+05:30 IST
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ డిమాండ్ చేశారు.

సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్
సూర్యాపేటటౌన్, డిసెంబరు 30: ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్ డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు చట్టాలపై కేంద్రప్రభుత్వానికి సీఎం కేసీఆర్ అనుకూలంగా మాట మార్చడం సిగ్గుచేటన్నారు. ఐకేపీ కేంద్రాలను ఎత్తివేయడాన్ని నిరసిస్తూ జనవరి 7వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని మండలకేంద్రాల్లో నిరసనలు, ధర్నా నిర్వహిస్తామని, జనవరి 11న జిల్లాకేంద్రంలో ధర్నా చేస్తామన్నా రు. సమావేశంలో నాయకులు అంజద్‌అలీ, కక్కిరేణి శ్రీనివాస్, కొండపల్లి సాగర్‌రెడ్డి, రంగయ్య, వెంకన్నయాదవ్, మల్లయ్య, జానయ్య, కుందమల్ల శేఖర్, ఆలేటి మాణిక్యం, తంగేళ్ళ కర్ణాకర్‌రెడ్డి, వెంకన్న, రాము ఉన్నారు.