మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-27T11:38:07+05:30 IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సాంఘీక సంక్షేమ శాఖ జడ్పీ స్థాయి సంఘం చైర్మన్‌ నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్‌, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌లు టీఆర్‌ఎస్‌ రాష్ట్ర

మెరుగైన వైద్య సేవలే ప్రభుత్వ లక్ష్యం

మునుగోడు, అక్టోబరు 26: ప్రజలకు మెరుగైన వైద్య  సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని  సాంఘీక సంక్షేమ శాఖ జడ్పీ స్థాయి సంఘం చైర్మన్‌ నారబోయిన స్వరూపారాణి రవి ముదిరాజ్‌, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్‌లు  టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు, రాజధాని బ్యాంకు చైర్మన్‌ వేమిరెడ్డి నర్సింహారెడ్డి ఇచ్చిన విరాళంతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను ఆదివారం ప్రారం భించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌  పార్టీ మండల అధ్యక్షుడు బండా పురుషోత్తమ్‌రెడ్డి, నాయకులు సురేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, దాడి శ్రీనివాస్‌రెడ్డి, అనంతస్వామి, చెరుకు కృష్ణయ్య ఎండీ రబీక్‌, జె.నాగరాజు, జి.విజయ్‌, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-27T11:38:07+05:30 IST