ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలం
ABN , First Publish Date - 2020-12-20T05:12:20+05:30 IST
ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి అన్నారు.

మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి
నల్లగొండ టౌన్ / నల్లగొండ క్రైం, డిసెంబరు 19 : ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ ఎమ్మెల్సీ బి.మోహన్‌రెడ్డి అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి బీజేపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట శనివారం నిర్వహించిన ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తాను 14మంది సీఎంలతో పని చేశానని, ఐదు పీఆర్సీ కమిటీల్లో ఉన్నానని, ప్రస్తుత సీఎం పీఆర్సీ కమిటీ వేసి మూడేళ్లయినా ఒక్క అడుగు ముందుకు వేయలేదని విమర్శించారు. ప్రభుత్వం మాటలు చెబుతూ అందరిని మభ్య పెడుతోందన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పీఆర్‌సీ, డీఏ ప్రకటించాలని, పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యధర్శి ప్రేమేందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి మట్లాడుతూ రెండు లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ప్రభుత్వం భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలన్నారు. కా ర్యక్రమంలో నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కూతూ రు లక్ష్మారెడ్డి, నూకల ఆదినారాయణరెడ్డి, పి.శ్యాంసుందర్, ఓరుగంటి రాము లు, నూకల వెంకటనారాయణరెడ్డి, గోలి ప్రభాకర్, కాశమ్మ, సముద్రాల మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాకేంద్రంలోని టీపీయూఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి అలుగుబెల్లి పాపిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుగు శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.