పల్లెల్లో భయం భయం

ABN , First Publish Date - 2020-05-11T09:55:28+05:30 IST

ముంబై నుంచి వచ్చిన వల స కూలీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటంతో పల్లెల్లో భయాందోళనలు ..

పల్లెల్లో భయం భయం

జనగాం, ఆరెగూడెంను సందర్శించిన అధికారులు


సంస్థాన్‌ నారాయణపురం, మే10: ముంబై నుంచి వచ్చిన వల స కూలీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అవుతుండటంతో పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మండలంలోని జనగాం గ్రామానికి చెందిన మొత్తం నలుగురికి కరోనా పాజిటివ్‌ రావడం, స్థానికంగా కలకలం రేపుతోంది. మండలంలోని జనగాం, గుడిమల్కాపురం, చిమిర్యాల, కంకణాలగూడెం, గుజ్జ తదిత ర గ్రామాలకు చెందిన ప్రజలు బతుకుదెరువు కోసం సుమారు 500మంది ముంబైకి వెళ్లారు. ముంబైలో కరోనా విజృభిస్తుండగా, కేంద్ర ప్రభుత్వం వలస కార్మికులకు ఇచ్చి న సడలింపుతో పలువురు సొంత గ్రామాలకు చేరుకున్నా రు. ఈనెల 3న జనగాం గ్రామానికి నలుగురు వలస కూలీ లు వచ్చారు. వీరిని గ్రామ శివారులోని పాఠశాలలోనే క్వార ంటైన్‌ చేశారు. ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు కూలీలకు ఇటీవల కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజాగా ఆదివారం మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఒక్క గ్రామంలో నలుగురికి పాజిటివ్‌ రావడంతో స్థానికులు భయం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనగాంకు రాకపోకలను నిషేధించారు. సంస్థాన్‌నారాయణపురం నుంచి జనగాంకు వెళ్లే దారిని, చండూరు వైపు నుంచి జనగాంకు వచ్చే దారిని బ్యారీకేడ్లతో ఏర్పాటు చేసి మూసివేశారు.


సందర్శించిన అధికారులు

జనగాం గ్రామాన్ని ఆర్డీవో సూరజ్‌కుమార్‌ ఆదివారం సందర్శించారు. గ్రామానికి చెందిన నలుగురు వలస కూలీలు కరోనాబారిన పడడంతో, గ్రామంలో పర్యటించారు. గ్రామంలోని పరిస్థితులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరితో కాంటాక్ట్‌ అయ్యారనే దానిపై ఆరా తీస్తున్నారు. తహసీల్దార్‌ గిరిధర్‌, ఎస్‌ఐ నాగరాజు, వైద్యాఽధికారి డాక్టర్‌ దీప్తితో పాటు ఇతర అధికారులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా కొత్త వ్యక్తులు వస్తే వెంటనే అధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆర్డీవో స్థానికులకు సూచించారు.


ఏడుగురు ఎయిమ్స్‌ క్వారంటైన్‌లో

మండలంలోని జనగాం గ్రామానికి చెందిన నలుగురు వలస కూలీలకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో గతంలో ముంబై నుంచి గ్రామానికి వచ్చిన నలుగురిని, కంకణాలగూడెం గ్రామానికి వచ్చిన ముగ్గురిని బీబీనగర్‌ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. అదేవిధంగా తాజాగా కరోనా వచ్చిన వ్యక్తితో పాటు అతడితో ఉన్న మరో ముగ్గురి కుటుంబ సభ్యులు, వారి కాంటాక్ట్‌లో ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన 13మందిని హోంక్వారంటైన్‌ చేశారు.


ఆత్మకూరు(ఎం): మండలంలోని పల్లెర్లలో ఆదివారం మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్రామానికి చెందిన ఓ టీవీ చానల్‌ రిపోర్టర్‌ ముంబై క్యాబ్‌లో ఎనిమిది మందితో ఈ నెల 7న గ్రామానికి వచ్చాడు. అదే రోజు బెంగుళూరునుంచి నలుగురు, చెన్నై నుంచి ముగ్గురు మండలంలోని వేర్వేరుగా గ్రామాలకు వచ్చారు. విషయం తెలుసున్న పీహెచ్‌సీ డాక్టర్‌ ప్రనీషా, తహసీల్దార్‌ పి.జ్యోతి సిబ్బందితో గ్రామాలకు వెళ్లి 14 మందికి వైద్య పరీక్షలు చేశారు. అందులో ముంబై నుంచి వచ్చిన ఏడుగురిలో ముగ్గురు, చెన్నై నుంచి వచ్చిన ముగ్గురిలో ఇద్దరికి జ్వరం ఉందని గుర్తించి బీబీనగర్‌కు తరలించారు. వారిలో ముగ్గురికి పాజిటివ్‌ వచ్చింది. విషయం తెలియగానే ఆర్డీవో భూపాల్‌రెడ్డి, పీహెచ్‌ డాక్టర్‌, తహసీల్దార్‌, ఎస్‌ఐ ఇక్కడికి చేరుకొని పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు స్థానికంగా కలిసిన మరో ఆరుగురిని బీబీనగర్‌కు తరలించారు. రహదారులను దిగ్బంధనం చేశారు. గ్రామంలో బ్లీచింగ్‌పౌడర్‌ చల్లించారు.


మోత్కూరు/అడ్డగూడూరు: పల్లెర్లలో వలస కూలీలకు పాజిటివ్‌ వెలుగులోకి రావడంతో మోత్కూరు, అడ్డగూడూరు మండలాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ మండలాల నుంచి చాలా మంది బతుకుదెరువు కోసం ముంబై వెళ్లారు. వారు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. ముంబై నుంచి శనివారం మోత్కూరు మండలం పొడిచేడు గ్రామానికి వచ్చిన ముగ్గురు వలస కార్మికులకు, ఆదివారం అడ్డగూడూరు మండల కేంద్రానికి వచ్చిన నలుగురికి, కోటమర్తి గ్రామానికి వచ్చిన 13 మందికి హోంక్వారంటైన్‌ స్టాంపులు వేసినట్టు ఆయా మండలాల వైద్యాధికారులు డాక్టర్‌ కిషోర్‌కుమార్‌, డాక్టర్‌ నరేష్‌ తెలిపారు. ఈ మండలాలకు వచ్చిన 20 మందిని పరీక్షల నిమిత్తం బీబీనగర్‌ ఏయిమ్స్‌కు పంపాలని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించినట్టు వారు తెలిపారు.

Updated Date - 2020-05-11T09:55:28+05:30 IST