మళ్లీ కంపించిన భూమి

ABN , First Publish Date - 2020-02-12T06:18:26+05:30 IST

సూర్యాపే ట జిల్లా చింతలపాలెం మండలంలో సోమవా రం 36 సార్లు భూమి కంపించింది. మధ్యా హ్నం వరకు 20 సార్లు

మళ్లీ కంపించిన భూమి

చింతలపాలెం, ఫిబ్రవరి 11 : సూర్యాపే ట జిల్లా చింతలపాలెం మండలంలో సోమవా రం 36 సార్లు భూమి కంపించింది. మధ్యా హ్నం వరకు 20 సార్లు రాగా, ఆ తర్వాత 16 సార్లు భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మూడు నుంచి నాలుగు సెకన్ల పాటు ఈ ప్రకంపనలు కొనసాగాయి.

మండలంలోని దొండపాడు గ్రామ ఆదర్శ కాలనీ ప్రాథమిక పాఠశాల, పాత వెల్లటూరులో హైదరాబాద్‌కు చెందిన నేషనల్‌ జియోఫిజికల్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ నగేష్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూకంప లేఖిని(రిక్టర్‌ స్కేల్‌) పై 2.9 తీవ్రత నమోదైనట్లు తహసీల్దార్‌ కమలాకర్‌ తెలిపారు. భూప్రకంపనలు చింతలపా లెం మండలంలోని పులిచింతల ముంపు గ్రామమైన పాతవెల్లటూరు కేంద్రంగా వస్తున్న ట్లు తహసీల్దార్‌ పేర్కొన్నారు.  

Updated Date - 2020-02-12T06:18:26+05:30 IST