కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలి

ABN , First Publish Date - 2020-12-27T04:58:55+05:30 IST

రైతులను ఇబ్బందులకు గురిచేసే రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు.

కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలు రద్దుచేయాలి
మోతెలో మాట్లాడుతున్న సీపీఎం నాయకుడు ములకలపల్లి రాములు

మోతె, డిసెంబరు 26: రైతులను ఇబ్బందులకు గురిచేసే రైతు చట్టాలను కేంద్ర ప్రభుత్వం విరమించు కోవాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ములకలపల్లి రాములు అన్నారు. మం డలకేంద్రంలో శనివారం సీపీఎం ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు సంఘీ భావం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మట్టిపెళ్లి సైదులు, గుంటగాని యేసు, లచ్చుమల్ల సత్యం, జంపాల స్వరాజ్యం, పాల్గొన్నారు. మఠంపల్లిలో సీపీ ఎం మండల కార్యదర్శి భూక్యపాండునాయక్‌ మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు గన్నా చంద్రశేఖర్‌ మాట్లాడారు. సీపీఎం ఆధ్వర్యం లో నేరేడుచర్లలో నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి నగేష్‌, మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్‌రావు, అనగంటి మీనయ్య, చిట్టిబాబు ఉన్నారు. ఈ నెల 30న హైదరాబాద్‌లో నిర్వహించే మహాధర్నాను విజయవం తం చేయాలని సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి డేవిడ్‌కుమార్‌ కోరారు. 

Updated Date - 2020-12-27T04:58:55+05:30 IST