నకిలీ పత్తి విత్తనాల నిల్వపై కేసు
ABN , First Publish Date - 2020-07-08T10:09:47+05:30 IST
నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచిన డీలర్‌తో పాటు మూడు కంపెనీలపై నల్లగొండ టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌లో ..

డీలర్‌తో పాటు మూడు కంపెనీలపై ఫిర్యాదు
నల్లగొండ క్రైం, జూలై 7: నకిలీ పత్తి విత్తనాలు నిల్వ ఉంచిన డీలర్‌తో పాటు మూడు కంపెనీలపై నల్లగొండ టూటౌన్ పోలీ్‌సస్టేషన్‌లో సోమవారం కేసు నమోదైంది. టూటౌన్ ఎస్‌ఐ దోరేపల్లి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఓ ఇంట్లో నకిలీ విత్తనాలు నిల్వ ఉంచారని నల్లగొండ ఏవో సుమన్ రామన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. విచారణలో పూర్తి వివరాలు సేకరించి డీలర్ జయమ్మతో పాటు ఆదిత్య అగ్రి ప్రొడక్ట్స్, సీతారామ, నయాగార సీడ్స్ కంపెనీలపై కేసు నమోదు చేశామన్నారు. ఇంకా పూర్తి వివరాలను సేకరిస్తున్నామని తెలిపారు. కాగా ఆదిత్య అగ్రి ప్రొడక్ట్స్ పేరుతో సీడ్ లైసెన్స్ కలిగిన విత్తనాలు అమ్ముతున్నానని డీలర్ జయమ్మ పేర్కొన్నారు. తమ దుకాణంలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీ చేసి చిన్నచిన్న తప్పులను గమనించి స్టాకు బోర్డు, రిజిస్టర్ రాయడం లేదని ఇచ్చిన షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చానన్నారు. అన్ని అనుమతులతో కూడిన విత్తనాలనే అమ్ముతున్నామని పేర్కొన్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తనపై కేసు నమోదైందని, గిట్టని వారే ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.