భువనగిరిలో ఉర్సు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-29T06:09:19+05:30 IST

జిల్లా కేంద్రం భువనగిరిలో ఉర్సు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.

భువనగిరిలో ఉర్సు ప్రారంభం
సంస్థాన్‌నారాయణపురంలో గంధం ఊరేగింపు

భువనగిరి టౌన్‌, డిసెంబరు 28: జిల్లా కేంద్రం భువనగిరిలో ఉర్సు ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎనిమిది దర్గాల్లో 11 రోజుల పాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఒక్కో దర్గాలో 3 రోజులు ఉర్సు వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి రోజు  గంధం ఊరేగింపు, రెండో రోజు ధీపారాధన, మూడో రోజు కవాళి, పంకా ఊరేగింపు అన్నదానం నిర్వహిస్తారు. ఈ మేరకు మొదటి రోజు హజీఉల్‌ హరమైన్‌ రహమతుల్లా అలై దర్గాలో గంధం ఊరేగింపు నిర్వహించారు. 29న ఖాజీమహల్లాలోని హజ్రత్‌ జమాలుల్‌, బహర్‌ దర్గా గంధం ఊరే గింపు, 30న కిసాన్‌ నగర్‌లోని బురానొద్దీన్‌ దర్గాలో గంధం ఊరేగింపు, 31న దీపారాధన, జనవరి 1న సయ్యద్‌ షా సోంటేపీర్‌ గంధం ఊరేగింపు, 2న లాల్‌షా వలీబాబా దర్గాతో పాటు మిగతా దర్గాల్లో వరుసగా ఉర్సు వేడుకలు నిర్వహిస్తారు. ఇందుకోసం దర్గాలను ప్రత్యేకంగా అలంకరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


‘సంస్థాన్‌’లోఘనంగా గ్యార్మీ పండుగ

సంస్థాన్‌ నారాయ ణపురం, డిసెంబరు28:  సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో గ్యార్మీ పండుగ ఉత్సవాలను ముస్లింలు భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామపం చాయతీ కార్యాలయం నుంచి షాదీఖానా వరకు గంథాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్ర మంలో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, జడ్పీటీసీ వీరమళ్ల భానుమతి, సర్పంచ్‌ శికిలమెట్ల శ్రీహరి, ఎంపీటీసీ బచ్చనగోని గాలయ్య, మైనార్టీ నాయకులు రహీంషరీఫ్‌, సోహెల్‌, ఆమోల్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-29T06:09:19+05:30 IST