చివరి భూములకు సాగునీరు అందించడమే లక్ష్యం
ABN , First Publish Date - 2020-12-31T04:39:34+05:30 IST
సాగర్ ఆయకట్టు పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే శా నంపూడి సైదిరెడ్డి అన్నారు.

హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్‌నగర్ రూరల్, డిసెంబరు 30: సాగర్ ఆయకట్టు పరిధిలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే శా నంపూడి సైదిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక విలేకరులతో మాట్లాడా రు. ప్రభుత్వ ఉద్యోగులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్‌లో పనిచేసే ఉద్యోగులకు సైతం జీతాలు పెంచిందన్నారు. సమావేశంలో మున్సిపల్ చైౖర్‌పర్సన్ గెల్లి అర్చన, వైస్‌చైర్మన్ నాగేశ్వరరావు, అమర్‌నాథ్‌రెడ్డి, కొప్పుల సైదిరెడ్డి, గూ డెపు శ్రీనివాసు, కెఎల్‌ఎన్‌రెడ్డి, జక్కుల వెంకయ్య, హరిబాబు ఉన్నారు.