వ్యవసాయ బిల్లును ఉపసంహరించుకోవాలి
ABN , First Publish Date - 2020-10-03T10:46:44+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి ..
జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల నిరసన
(ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్):కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నిరసనలో భాగంగా సూర్యాపేటలో చేపట్టిన ర్యాలీ, సంతకాల సేకరణలో ఆయన పాల్గొన్నారు. కొత్తబస్టాండ్ నుంచి వాణిజ్యభవన్ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. రైతును వ్యవసాయానికి దూరం చేసేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టడం దుర్మార్గమైన చర్య అన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, పట్టణ అధ్యక్షుడు అంజద్‌అలీ, కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు. అదేవిధంగా నాగారం మండల కేంద్రంలో సూర్యాపేట-జనగాం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి గుడిపాటి నర్సయ్య, నాయకులు ఆకుల బుచ్చిబాబు, పసుపులేటి వెంకట్‌రెడ్డి, మంజుల పాల్గొన్నారు.
చింతలపాలెంలో గ్రామశాఖ అధ్యక్షుడు నందిరెడ్డి ఇంద్రరెడ్డి, హానిమిరెడ్డి, కోటిరెడ్డి, జానీమియ పాల్గొన్నారు. నడిగూడెంలో ఎంపీటీసీ గుండుశ్రీను, శ్రీనివాస్, షాంషేర్‌బేగ్, మహేందర్ పాల్గొన్నారు. తుంగతుర్తిలో మహిళ విభాగ్ జిల్లా అధ్యక్షురాలు తిరుమలప్రగఢ అనురాధ, కిషన్‌రావు, అనూప్, వెంకన్న పాల్గొన్నారు. మద్దిరాలలో సూర్యాపేట-దంతాలపెల్లి రహదారిపై రాస్తారో నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు ముక్కాల అవిలమల్లు, బొబ్బలి వెంకన్న, పచ్చిపాల వెంకన్న, తాలపెల్లి సురేష్, వల్లపు రమేష్ పాల్గొన్నారు. అర్వపల్లిలోనూ రాస్తారోకో నిర్వహించారు. నాయకులు అనిరెడ్డి రాజేందర్‌రెడ్డి, మోరపాక సత్యం, నసీర్ పాల్గొన్నారు.
చిలుకూరులో గాంధీ విగ్రహం ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్ర మంలో యడవెల్లి పుల్లారావు, నాగిరెడ్డి పాల్గొన్నారు. హుజూర్‌నగర్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అరుణ్‌కుమార్, అజీజ్‌పాషా, కస్తాల శ్రావణ్, శివరామ్ పాల్గొన్నారు. నూతనకల్‌లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్‌రెడ్డి, మహేశ్వరం చంద్రకళవెంకటయ్య, ఉప్పుల పాపయ్య, దరిపెల్లి వీరన్న, మేడిపల్లి అశోక్ ఉన్నారు. కోదాడలో నల్లజెండాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, కాంపాటి శ్రీను, పాలకి అర్జున్, వరప్రసాద్‌రెడ్డి, గంధం యాదగిరి పాల్గొన్నారు.