మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎజెండా మార్చాలి

ABN , First Publish Date - 2020-12-29T05:45:04+05:30 IST

అధికార పార్టీకి మేలు చేసే విధంగా రూపొందించిన కౌన్సిల్‌ ఎజెండాను మార్చాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, కమిషనర్‌ వెంకన్నకు సోమవారం వినతిపత్రం అందించారు.

మునిసిపల్‌ కౌన్సిల్‌ ఎజెండా మార్చాలి
కమిషనర్‌కు వినతిపత్రం అందిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు

 కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్ల వినతిపత్రం
మిర్యాలగూడ టౌన్‌, డిసెంబరు 28 :
అధికార పార్టీకి మేలు చేసే విధంగా రూపొందించిన కౌన్సిల్‌ ఎజెండాను మార్చాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లు మునిసిపల్‌ చైర్మన్‌ తిరునగరు భార్గవ్‌, కమిషనర్‌ వెంకన్నకు సోమవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పట్టణాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాల్సిన పాలకవర్గం అధికార పార్టీ కౌన్సిల్‌ సభ్యులకు అనుకూలంగా ని ధులు కేటాయిస్తూ అజెండా తయారు చేశారన్నారు. పొందుపరచిన 1,2,3,74వ అంశాలు న్యాయపరంగా లేవని, కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్ల వార్డుల అభివృద్ధికి ఆటంకం కలిగించేవిలా ఉన్నాయన్నారు. సభ్యులతో చర్చించకుండా కౌన్సిల్‌ ఆమోదానికి ప్రవేశపెట్టడం ఆక్షేపణీయమన్నారు. ఈ నెల 31న జరగనున్న కౌన్సిల్‌ సాధారణ సమావేశంలో పైన పేర్కొన్న నాలుగు అంశాలను కాంగ్రెస్‌ కౌన్సిలర్లు 19మంది తిరస్కరిస్తున్న తరుణంలో కమిషనర్‌కు డీసెంట్‌ నోట్‌ అందించినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా డెవల్‌పమెంట్‌ ఫండ్‌ను అన్ని వార్డులకూ సక్రమంగా పంచాలని, ప్రస్తుతం రూపొందించిన జెండాను మార్చి సమావేశం నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో కౌన్సిలర్లు ముదిరెడ్డి నర్సిరెడ్డి, జాని, జలంధర్‌రెడ్డి, అనిత, నాగలక్ష్మి, రవి, రామకృష్ణ, సక్కుబాయి, పట్టణ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్‌రెడ్డి తదితరులున్నారు. మునిసిపల్‌ కార్యాలయంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయాలని కోరుతూ ఆప్‌ నాయకులు ఎండీ.ఖయూంఖాన్‌ మునిసిపల్‌ కమిషనర్‌ వెంకన్నకు వినతిపత్రం అందించారు.

Updated Date - 2020-12-29T05:45:04+05:30 IST