తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి

ABN , First Publish Date - 2020-11-20T05:53:32+05:30 IST

తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందాడు. మండలంలోని గొలనుకొండ గ్రామానికి చెందిన బందారపు సత్యనారాయణ(40) గురువారం ఉదయం తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు.

తాటిచెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి

ఆలేరు రూరల్‌, నవంబరు 19: తాటిచెట్టు పై నుంచి పడి గీతకార్మికుడు మృతి చెందాడు. మండలంలోని గొలనుకొండ గ్రామానికి చెందిన బందారపు సత్యనారాయణ(40) గురువారం ఉదయం  తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సత్యనారాయణకు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. బాధితుడి కుటుంబానికి  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రూ.50వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, ఎంపీపీ గంధమల్ల అశోక్‌ ఉన్నారు.

ముత్తిరెడ్డిగూడంలో

భువనగిరి రూరల్‌: మండలంలోని ముత్తిరెడ్డిగూడంలో తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడికి గాయాలయ్యాయి. గీతకార్మికుడు కంచర్ల స్వామి రోజూ మాది రిగా తాటిచెట్టు ఎక్కగా, ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమ నించిన స్థానిక గీతకార్మికుడు అతడిని హుఠాహుటిన చికిత్స నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. గాయపడిన గీతకార్మికుడిని ఆదుకోవాలని సర్పంచ్‌ మాకోలు సత్యం, ఎంపీటీసీ రాంపల్లి కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.




Updated Date - 2020-11-20T05:53:32+05:30 IST