రాజ్యాంగం ప్రాముఖ్యతను తెలుసుకోవాలి
ABN , First Publish Date - 2020-11-27T05:46:41+05:30 IST
భారతదేశ రాజ్యాంగం చరిత్ర, ప్రాముఖ్యత, ఉపోద్గతం, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు.

నల్లగొండ రూరల్, నవంబరు 26 : భారతదేశ రాజ్యాంగం చరిత్ర, ప్రాముఖ్యత, ఉపోద్గతం, రాజ్యాంగ గొప్పదనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగ సభ 1949 లో నవంబర్ 26 వ తేదీన ఆమోదించిందని అన్నారు. అప్పటి నుండి నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం,రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వి. చంద్ర శేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తో రాజ్యాంగ ఉపోద్గతం చదివించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సి.ఈ. ఓ.వీరబ్రహ్మచారి, డి.పి.ఓ.విష్ణువర్ధన్,డి. ఈ. ఓ.భిక్షపతి, కలెక్టరేట్ ఏవో మోతీలాల్ వివిధ విభాగాల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.