నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఈ కోదాడ యువకుడి మాటలు వింటే..
ABN , First Publish Date - 2020-04-05T13:27:17+05:30 IST
కరోనా వైరస్ ఫలితంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దినదినగండంగా బతకాల్సి వస్తుంది. నాలుగేళ్లుగా అమెరికాలో..

కోదాడ: కరోనా వైరస్ ఫలితంగా అమెరికాలోని న్యూయార్క్ నగరంలో దినదినగండంగా బతకాల్సి వస్తుంది. నాలుగేళ్లుగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితిలో అది ఉంటదో లేదో తెలియని స్థితి. ఉద్యోగం లేదంటూ ఎప్పుడు మెయిల్ వస్తుందోనని ఆందోళనగా ఉంది. వైరస్ కారణంగా గడప దాటి బయటకు రావటంలేదు. ఇంట్లో ఉండే విధులు నిర్వహిస్తున్నాం. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాం. భారత్ నుంచి ఎందుకు వచ్చామంటూ తలుచుకుంటూ ఉంటున్నాం. భయం, భయంతో గడుపతున్నాం.
పొనగండ్ల సాయినాథ్‌రెడ్డి, కోదాడ