లారీల ట్యాక్స్‌ను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-04-25T09:47:34+05:30 IST

లారీల క్వాటర్లీ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దుచేయాలని రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, ప్రధాన కార్యదర్శి

లారీల ట్యాక్స్‌ను రద్దు చేయాలి

చౌటుప్పల్‌ టౌన్‌, ఏప్రిల్‌ 24: లారీల క్వాటర్లీ ట్యాక్స్‌ను ప్రభుత్వం రద్దుచేయాలని రాష్ట్ర లారీ యజమానుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బూడిద నందారెడ్డి, ప్రధాన కార్యదర్శి దబ్బేటి రాములుగౌడ్‌  కోరారు.


హైదరాబాద్‌ లో శనివారం రవాణా శాఖ కమిషనర్‌ ఎస్వీఎన్‌ రావును నందారెడ్డి, రాములుగౌడ్‌లు కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. కరోనా వైరస్‌ సమస్యతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయని, దీంతో లారీల యజమానుల పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. కాగా, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని కమిషనర్‌ హామీ ఇచ్చారు.

Updated Date - 2020-04-25T09:47:34+05:30 IST