టాస్క్‌ఫోర్స్ అధికారుల తనిఖీలు
ABN , First Publish Date - 2020-03-02T11:33:43+05:30 IST
నల్లగొండ జిల్లా మర్రిగూడలో జిల్లా ప్రత్యేక నిఘా బృందం అధికారు లు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ‘బెల్టు’ నిర్వాహకుల కొత్త పం థా

నల్లగొండ, మార్చి 1: నల్లగొండ జిల్లా మర్రిగూడలో జిల్లా ప్రత్యేక నిఘా బృందం అధికారు లు ఆదివారం తనిఖీలు చేపట్టారు. ‘బెల్టు’ నిర్వాహకుల కొత్త పం థా శీర్షికన ఫిబ్రవరి 29న ఆంధ్రజ్యోతి మి నీలో ప్రచురితమైన వార్తకు అధికారు లు స్పందించారు. మర్రిగూడలో మద్యం, బెల్టుషాపుల ద్వారా మద్యం విక్రయిస్తూ, అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలుసుకున్న ప్రత్యేక అధికారులు నిఘా ఏర్పాటు చేశారు. అధికారుల బృం దం మర్రిగూడలో పర్యటించి పలువురిని రహస్యంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పలు బెల్టుషాపుల వద్దకు కూడా వెళ్లి నిర్వాహకులను సమాచారం అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మండలంలో అసాంఘీక కార్యక్రమాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.