సూర్యాపేటలో పీడీఎస్ బియ్యం పట్టివేత
ABN , First Publish Date - 2020-12-11T05:42:34+05:30 IST
జిల్లాకేంద్రంలో 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట క్రైం, డిసెంబరు 10 : జిల్లాకేంద్రంలో 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని సీసీఎస్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్‌లో తనిఖీలు చేస్తుండగా కృష్ణయ్య ఇంట్లో 14 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం, నూకలు తయారు చేసే యంత్రాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.