సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2020-10-07T14:33:24+05:30 IST

జిల్లాలోని నేరేడుచర్ల ముత్యాలమ్మ కుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి

సూర్యాపేట: జిల్లాలోని నేరేడుచర్ల ముత్యాలమ్మ కుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. వేగంగా వస్తున్న ఓ లారీ... ఎఫ్ జడ్ బైక్‌ను ఢీ కొట్టింది. కాగా తప్పించుకునే క్రమంలో మరో బైక్‌ను ఎఫ్ జెడ్ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎఫ్ జెడ్ బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు నక్కసాయి(18), వెంకటేష్ (21)  మృతి చెందగా... మధు అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతులు గరిడేపల్లి మండలం పోనుగొడు వాసులుగా గుర్తించారు. నెరేడుచర్ల 108 వాహనం మరమ్మతులకు గురవడంతో... ప్రమాదం జరిగిన చాలా సేపటికి పెన్ పహాడ్ నుంచి 108 వాహనం  వచ్చింది. కాగా గాయపడిన వారిలో సాయి అనే వ్యక్తి  పెన్ పహాడ్ 108 వాహనం పైలెట్ కొడుకుగా గుర్తించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా సాయితో పాటు వెంకటేష్ ఇద్దరూ మృతి చెందారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more