కరోనాతో ప్రాణాలు పోవు
ABN , First Publish Date - 2020-08-11T11:36:54+05:30 IST
కరోనా వస్తే ప్రాణాలేమీ పోవు.. మానసిక ధైర్యం కోల్పోకుండా, వైద్యుల సలహాలు పాటించి, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే

మానసిక ధైర్యం ముఖ్యం
కొవిడ్‌ను జయించిన కాంగ్రెస్ భువనగిరి నేత పోతంశెట్టి
యాదాద్రి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కరోనా వస్తే ప్రాణాలేమీ పోవు.. మానసిక ధైర్యం కోల్పోకుండా, వైద్యుల సలహాలు పాటించి, చిన్నపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది.. పాజిటివ్ వచ్చిన వ్యక్తులపై వైరస్ ప్రభావం కంటే చుట్టుపక్కల వాళ్లు వ్యవహరిస్తున్న తీరే మానసికంగా కుంగదీస్తుందని కొవిడ్‌ను జయించిన కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ నేత పోతంశెట్టి వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. ఆయన ఇంకా ఏం చెప్పారంటే...ప్రస్తుత కష్టకాలంలో పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ, పట్టణంలో మృతిచెందిన వారి అంత్యక్రియల నిర్వహణలో పాల్గొన్నా.
దీంతో జూలై 12న నాకు పాజిటివ్ వచ్చింది. వెంటనే హోంక్వారంటైన్లో ఉన్నా. వైద్యుల సూచనల మేరకు మందులు, పౌష్ఠికాహారం తీసుకున్నా. నా భార్య తగిన జాగ్రత్తలు తీసుకుంటూ, భౌతికదూరం పాటి స్తూ నాకు అవసరమైన సపర్యలు చేసింది. ముఖ్యంగా వేడినీళ్లు తాగ డం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఉపశమనం కలిగింది. ఆగ స్టు 5న మరోసారి పరీక్ష చేయించగా, నెగటివ్ వచ్చింది. మా ఇంటిలో నా ఒక్కడికే పాజిటివ్ రాగా, కుటుంబ సభ్యులకు వైరస్ సోకలేదు. నా కు పాజిటివ్ వచ్చిందనగానే చుట్టుపక్కల వారి ప్రవర్తన చాలా బాధాకరంగా అనిపించింది.
కరోనా ఏమీ ప్రాణాలు తీయదు. కొద్దిపాటి జాగ్రత్తలు, సరైన వైద్యం తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ, పాజిటివ్‌లు మానసిక ధైర్యం కోల్పోవద్దు. చుట్టుపక్కల వాళ్లు సైతం చేతనైన సహా యం చేయడంతోపాటు, మానసిక ధైర్యం కల్పించాలి. వారి పట్ల అనుమానంగా, కుంగదీసేలా వ్యవహరించవద్దు. పాజిటివ్ నుంచి బయటపడిన అనుభవంతో ఇతరులకు సహాయ, సహకారాలు అందించేందు కు సిద్ధంగా ఉన్నారు. ఎవరికి ఏ అవసరమైనా నన్ను ఫోన్లో సంప్రదిస్తే అండగా ఉంటా. నా నెంబర్ 9848307787