యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-03-02T11:36:14+05:30 IST

మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి చెందిన ఎండీ జాకీర్‌ (26) లక్కారం

యువకుడి ఆత్మహత్య

చౌటుప్పల్‌ రూరల్‌, మార్చి1: మద్యానికి బానిసైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రానికి చెందిన ఎండీ జాకీర్‌ (26) లక్కారం శివారులో పంచరు దుకాణంలో పనిచేస్తూ బంగారిగడ్డలో భార్యపిల్లలతో నివాసం ఉంటున్నాడు.  కొంతకాలంగా మద్యానికి బానిసైన జాకీర్‌ భార్యతో తరుచుగా గొడవ పడేవాడు. ఆదివారం  మోతాదుకు మించి మద్యం తాగిన  జాకీర్‌   ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం  స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-02T11:36:14+05:30 IST