ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-08-12T10:49:59+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామంలో వ్యక్తి మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

పెద్దఅడిశర్లపల్లి, ఆగస్టు 11: ఆర్థిక ఇబ్బందులతో పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామంలో వ్యక్తి మంగళవారం  ఆత్మహత్య చేసుకున్నాడు. గుడిపల్లి ఎస్‌ఐ గోపాల్‌రావు తెలిపిన వివరాల ప్రకారం దుగ్యాల గ్రామానికి చెందిన సుంకోజు రవి(45) పది సంవత్సరాలుగా హైదరాబాద్‌లో మెడికల్‌ షాప్‌లో గుమస్తాగా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల నుంచి ఇంటి వద్దనే ఉంటున్నాడు. అప్పటినుంచి ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురై మంగళవారం ఉద యం ఇంటి నుంచి గ్రామ శివారులో గల తన వ్యవసాయ బావివద్దకు వెళ్లి వస్తానని తండ్రితో చెప్పి  వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న బంగారం పాలిష్‌ చేయడానికి ఉపయోగించే సైనేడ్‌ను మద్యంలో కలుపుకుని తాగాడు. వ్య వసాయ బావి వద్దే మృత్యువాతపడగా పక్క పొలం వారు గమనించి తండ్రి నరహ రికి సమాచారం అందించారు. రవికి భార్య, కూతురు ఉన్నారు. రవి తల్లి గోవర్థనమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-08-12T10:49:59+05:30 IST