ఫోన్‌చేస్తే సూచనలు, సలహాలు ఇవ్వాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-08-12T10:48:29+05:30 IST

కరోనా బాధితులు, కుటుంబసభ్యులు గానీ కంట్రోల్‌ రూం సిబ్బందికి ఫోన్‌ చేస్తే సూచనలు, సలహాలు, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు

ఫోన్‌చేస్తే సూచనలు, సలహాలు ఇవ్వాలి: కలెక్టర్‌

భువనగిరి రూరల్‌, ఆగస్టు 11:  కరోనా బాధితులు, కుటుంబసభ్యులు గానీ కంట్రోల్‌ రూం సిబ్బందికి ఫోన్‌ చేస్తే సూచనలు, సలహాలు, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వాకబు చేయాలని కలెక్టర్‌ అనితరామచంద్రన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కోవిడ్‌-19 కంట్రోల్‌ రూంను కలెక్టర్‌ మంగళవారం అకస్మికంగా తనిఖీ చేశారు. రోగుల మనోధైర్యం దెబ్బతినకుండా చూడాలని సిబ్బందికి ఆమె సూచించారు. అవసరమైతే వారి దగ్గరికి వైద్య సిబ్బందిని కూడా పంపాలని సూచించారు. ఆమెవెంట ట్రైనీకలెక్టర్‌ గరీమాఅగర్వాల్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-08-12T10:48:29+05:30 IST