భార్య పుట్టింటికి వెళ్లిందని..

ABN , First Publish Date - 2020-12-11T05:40:05+05:30 IST

కుంటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వ్యక్తి జిల్లాకేంద్రంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు.

భార్య పుట్టింటికి వెళ్లిందని..

సూర్యాపేటక్రైం, డిసెంబరు 10: కుంటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వ్యక్తి జిల్లాకేంద్రంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని శ్రీరాంనగర్‌కాలనీకి చెందిన కోట అశ్విన్‌కుమార్‌ బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. భార్యాభర్తల మధ్య గురువారం ఉదయం స్వల్ప ఘర్షణ జరిగింది. రజిత ఇద్దరు కుమారులను తీసుకొని తల్లిగారింటికి వెళ్లింది. దీంతో మనస్తాపానికి గురైన అశ్విన్‌కుమార్‌(37) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పని నిమిత్తం స్వగ్రామం నుంచి సూర్యాపేటకు వచ్చిన అశ్విన్‌కుమార్‌ తండ్రి ఇంటికి వెళ్లి చూసేసరికి అశ్విన్‌కుమార్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉన్నాడు. పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. అశ్విన్‌కుమార్‌ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2020-12-11T05:40:05+05:30 IST