జిల్లాలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు చర్యలు

ABN , First Publish Date - 2020-12-28T05:54:47+05:30 IST

జిల్లాలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు క్రికెట్‌ జిల్లా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అమీనోద్దీన్‌బాబా తెలిపారు.

జిల్లాలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటుకు చర్యలు
ఎంపికైన జాబితా ప్రకటిస్తున్న నిర్వాహకులు

క్రికెట్‌ జిల్లా అసోసియేషన్‌  ప్రధాన కార్యదర్శి అమీనోద్దీన్‌బాబా
నల్లగొండ స్పోర్ట్స్‌, డిసెంబరు 27 :
జిల్లాలో క్రికెట్‌ స్టేడియం ఏర్పాటు కు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడు ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నట్లు క్రికెట్‌ జిల్లా అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సయ్యద్‌ అమీనోద్దీన్‌బాబా తెలిపారు. జిల్లాకేంద్రంలోని మేకల అభినవ్‌ స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన 2డే లీగ్‌ ఉమ్మడి జిల్లా క్రికెట్‌ జట్ల ఎంపిక పోటీలు ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను రంజీ టీమ్‌లో తీసుకోనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేన్‌ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న మహ్మద్‌ అజహరుద్దీన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను ఎంపిక చేసే అవకాశం కల్పించారన్నారు.  క్రికెట్‌  పోటీలకు మూడు జిల్లాల నుంచి 200మంది క్రీడాకారులు హాజరవగా  క్రీడాకారుల బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పోటీ నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చిన వారిని జనవరి 1వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రికెట్‌ 2డే లీగ్‌ పోటీలకు ఎంపిక చేశారు. కార్యక్రమంలో కోచ్‌ అలీ, అంపైర్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T05:54:47+05:30 IST