మత్స్యకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-12-20T05:14:04+05:30 IST

మత్స్యకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, జడ్పీటీసీ బానోతు జగన్‌నాయక్‌ అన్నారు.

మత్స్యకారులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం
చెరువులో చేపపిల్లలను వదులుతున్న ఎంపీపీ, జడ్పీటీసీ

మఠంపల్లి, డిసెంబరు 19: మత్స్యకార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని ఎంపీపీ ముడావత్‌ పార్వతీకొండానాయక్‌, జడ్పీటీసీ బానోతు జగన్‌నాయక్‌ అన్నారు. ప్రభుత్వం అందజేసిన చేపపిల్లలను యాతవాకిళ్ళ, వేములూరి ప్రాజెక్టుల్లో శనివారం వారు వదిలారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కోలాహలం లక్ష్మీనరసింహారాజు, మత్స్యశాఖ అధికారులు సైదులు, మల్లిఖార్జున్‌, నాయకులు మన్నెం శ్రీనివా్‌సరెడ్డి, కోలాహలం కృష్ణంరాజు, కార్యదర్శి సీతారామయ్య, వేములూరి ప్రాజెక్టు మత్స్యశాఖ కమిటీ నాయకులు ఈద బక్కయ్య, కీసరివెంకన్న, షేక్‌ పెద్దనజీర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-20T05:14:04+05:30 IST