ఆధ్యాత్మికత, ఆహ్లాదానికి పెద్దపీట
ABN , First Publish Date - 2020-12-06T05:29:11+05:30 IST
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆధ్యాత్మికత, ఆహ్లాదానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివా్‌సగుప్త అన్నారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.
భువనగిరి ఖిల్లా నుంచి యాదాద్రికి రోప్‌వే
బస్వాపురంలో ఎకరం స్థలంలో హరితకాటేజ్
టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివా్‌సగుప్త
యాదాద్రి టౌన్, డిసెంబరు 5: యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా ఆధ్యాత్మికత, ఆహ్లాదానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని టూరిజం డెవల్‌పమెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివా్‌సగుప్త అన్నారు. శనివారం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో ఆయనకు స్వాగతం పలికిన అర్చకులు పూజల అనంతరం ఆశీస్సులు అందజేశారు. ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని ఈవో గీతారెడ్డి అందజేశారు. అనంతరం ప్రధానాలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఘాట్‌రోడ్డులోని హరితకాటేజ్‌లో విలేకరులతో మాట్లాడుతూ, దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు యాదాద్రిలో సర్వ హంగులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి కానున్నాయని, వైష్ణవ పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం ఆలయ ఉద్ఘాటన ఉంటుందని తెలిపారు. బస్వాపూర్ రిజర్వాయర్‌తో పాటు ఆ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ 90 ఎకరాలు కేటాయించినట్టు తెలిపారు. అక్కడ రిసార్ట్‌లు, వెల్‌నెస్ సెంటర్లు, అడ్వెంచర్ యాక్టివిటీ్‌సతో నిర్మాణాలు రానున్నాయన్నారు. ఎకరం స్థలంలో బస్వాపూర్ వద్ద హరితహోటల్ నిర్మిస్తామన్నారు. అందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని, త్వరలో పనులకు శ్రీకారం చుట్టనున్నట్టు చెప్పారు. భువనగిరి ఖిల్లా నుంచి యాదాద్రికి రోప్‌వేతో పాటు గార్డెన్ ప్లేగ్రౌండ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాయిగిరి రెండు గుట్టలను అనుసంధానం చేస్తూ రోప్‌వే నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ప్రతిపాదనలు సీఎంకు అందజేయనున్నట్టు చెప్పారు. కాగా, భువనగిరి ఖిల్లాను సైతం శ్రీనివా్‌సగుప్త సందర్శించారు. ఆయన వెంట టూరిజం ఎండీ మనోహర్, జనరల్ మేనేజర్ నాదన్, డీఈ పరుశువేది మునిసిపల్ చైర్మన్ ఎనబోయిన అంజనేయులు, వైస్‌చైర్మన్ చింతల కిష్టయ్య, కౌన్సిలర్లు పంగ స్వామి, వడిశర్ల లక్ష్మి తదితరులు ఉన్నారు.