మహాద్భుత ఆలయానికి సీఎం శ్రీకారం

ABN , First Publish Date - 2020-12-05T05:59:07+05:30 IST

మహాద్భుత ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని వ్యవసాయ, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు.

మహాద్భుత ఆలయానికి సీఎం శ్రీకారం
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి

వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

యాదాద్రీశుడికి ప్రత్యేక పూజలు

యాదాద్రి టౌన్‌, డిసెంబరు 4: మహాద్భుత ఆలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ శ్రీకారం చుట్టారని వ్యవసాయ, కోఆపరేటివ్‌, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని శుక్రవారం ఆయ న కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. క్షేత్ర సందర్శనకు విచ్చేసిన మంత్రికి అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకొని అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి, ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆయన ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ చిత్తశుద్ధితో ఆలయ పునర్నిర్మాణం జరుగుతోందన్నారు. అత్యంత ప్రజ్ఞాపాటవాలు కలిగిన శిల్పులు ఆలయ నిర్మాణంలో పాల్గొంటున్నారని తెలిపారు. 

Updated Date - 2020-12-05T05:59:07+05:30 IST