శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలి

ABN , First Publish Date - 2020-12-04T05:05:02+05:30 IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు.

శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని అలవర్చుకోవాలి
కోదాడలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్‌

కోదాడ, డిసెంబరు 3: తెలంగాణ రాష్ట్ర సాధనలో అశువులు బాసిన శ్రీకాంతాచారి పోరాట స్ఫూర్తిని యువత ఆదర్శంగా తీసుకోవాలని  ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విశ్వబ్రాహ్మణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకాంతాచారి వర్ధంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీకాంతాచారి త్యాగాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరిచిపోదన్నారు. కార్యక్రమంలో చందు నాగేశ్వరరావు, పయిడిమర్రి సత్యబాబు, రోజారమణి, మేదర లలిత, వెంకటేశ్వర్లు, మధు, శ్రీనివాసరావు, కైలాస్వామి, బ్రహ్మణం, అనంతాచారి,  రమే్‌షబాబు, ఉపేందర్‌, రమాదేవి, సుధారాణి పాల్గొన్నారు. 


సూర్యాపేటటౌన్‌:జిల్లా కేంద్రంలోని న్యూలైఫ్‌ స్వచ్ఛంద సేవాసమితి అధ్యక్షుడు పోతుగంటి వీరాచారి కార్యాలయంలో శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కార్య క్రమంలో వెంకటాచారి, పాండురంగాచారి, సోమాచారి పాల్గొన్నారు.


హుజూర్‌నగర్‌: రాష్ట్రంలోని ఒక జిల్లాకు శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్‌ కోరారు. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బాణోతు ప్రసాద్‌, గురవయ్య, వెంకటరాజు పాల్గొన్నారు. 


చిలుకూరు : బాపూజీ గ్రంథాలయంలో  శ్రీకాంతాచారి వర్ధంతిని టీఆర్‌ఎస్‌ నాయకులు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రమణ నాగయ్య, కస్తూరి సైదులు, కొండా అన్నపూర్ణ, మేకపోతుల శ్రీను, మాదవరపు శ్రీను, బెల్లకొండ రాదకిష్ణ, పాషా పాల్గొన్నారు. 


నేరేడుచర్ల: మండల కేంద్రంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి  టీజేఎస్‌  కన్వీనర్‌ వురిమళ్ల రాధాకృష్ణ నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు ధూళిపాళ ధనుంజయనాయుడు, కొదమగుండ్ల నగేష్‌, కొమర్రాజు వెంకట్‌, రావుల సత్యం, అబ్రహం పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T05:05:02+05:30 IST