క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం : రాహుల్‌శర్మ

ABN , First Publish Date - 2020-12-07T05:08:21+05:30 IST

క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడుతాయని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు.

క్రీడలు శారీరక దృఢత్వానికి దోహదం : రాహుల్‌శర్మ
విజేతలతో అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శర్మ, నాయకులు

నల్లగొండ స్పోర్ట్స్, డిసెంబరు 6 : క్రీడలు శారీరక దృఢత్వానికి ఎంతో దోహదపడుతాయని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ రాహుల్‌శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన మల్లు వెంకటనర్సింహారెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్‌, బ్యాడ్మి ంటన్‌ క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అంది ంచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడలతో మానసిక వత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సహించాలని సూచించారు. ఎంవీఎన్‌ విజ్ఞాన కేంద్రం ఆఽ ద్వర్యంలో చేపడుతున్న పలు సేవా కార్యక్రమాలను అభినందించారు. అనంతరం విజేతల కు బహుమతులు అందించారు. కార్యక్రమంలో ట్రస్టు కార్యనిర్వాహణ కా ర్యదర్శి పి.నర్సిరెడ్డి, యారాల ప్రభాకర్‌రెడ్డి, తహసీల్దార్లు శేపూరి క్రిష్ణయ్య, మందడి మహేందర్‌రెడ్డి, పంతులు శ్రీనివాస్‌, మేకల విజయభాస్కర్‌, నరేందర్‌రెడ్డి, యాదగిరి, హరినారాయణ, వెంకన్న పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T05:08:21+05:30 IST