హాలియాలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థల పరిశీలన
ABN , First Publish Date - 2020-12-20T05:27:50+05:30 IST
హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ శనివారం సాగర్ ఎన్నెస్పీ కెనాల్, ప్రభుత్వ ఐటీఐ సమీపంలో ఉన్న స్థలాలను పరిశీలించారు.

హాలియా, డిసెంబరు 19: హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ శనివారం సాగర్ ఎన్నెస్పీ కెనాల్, ప్రభుత్వ ఐటీఐ సమీపంలో ఉన్న స్థలాలను పరిశీలించారు. అంతకు ముందు మండలంలోని పులిమిమాడి గ్రామ పంచాయతీ పరిధిలోని సాగర్ రోడ్డు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, మంకీఫుడ్ కోర్టులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్, తహసీల్దార్ మంగ, ఆర్‌ఐ సుష్మిత ఉన్నారు.