వృద్ధురాలిపై లైంగిక దాడి, హత్య
ABN , First Publish Date - 2020-03-02T11:39:53+05:30 IST
అనుముల మం డలం మారేపల్లిలో శనివారం రాత్రి ఓ వృద్ధురాలు(90)హత్యకు గురైంది. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న

హాలియా, మార్చి 1: అనుముల మం డలం మారేపల్లిలో శనివారం రాత్రి ఓ వృద్ధురాలు(90)హత్యకు గురైంది. వృద్ధురాలు ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెపై లైంగికదాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైందని, ఆపై హత్య చేసి ఉండవచ్చని హాలియా సీఐ చంద్రశేఖర్ తెలిపారు. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. గ్రామానికే చెందిన ఓ వ్య క్తి మద్యం మత్తులో ఇంటి పరిసరాల్లో తి రిగాడని, హత్యకు అ తడే కారణం కావచ్చని వృద్ధురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ ఆ స్పత్రికి తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. వృద్ధురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
వృద్ధురాలి హత్య విషయం తెలుసుకు న్న మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వర్‌రా వు మారేపల్లి గ్రామానికి చేరుకొని సంఘటన స్థలాన్ని సందర్శించారు. ఘటన వి వరాలను బాధితుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.