ఆలేరులో త్వరలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సేవలు

ABN , First Publish Date - 2020-06-21T11:19:24+05:30 IST

త్వరలో ఆలేరులో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వవిప్‌, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి

ఆలేరులో త్వరలో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సేవలు

ఆలేరు, జూన్‌ 20: త్వరలో ఆలేరులో కిడ్నీ వ్యాధిగ్రస్థులకు సేవలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వవిప్‌, స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి తెలిపారు. నియోజకవర్గ కేంద్రమైన ఆలేరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో రూ.40లక్షలతో నూతనంగా నిర్మించిన డయాలసిస్‌ సెంటర్‌ భవనంలో శనివారం విప్‌  శాస్త్రోక్తపూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.  డయాలసిస్‌ కేంద్రానికి కావాల్సిన వైద్య సిబ్బంది ఏర్పాటు, ఆసుపత్రి నిర్వహణ హైదరాబాద్‌కు చెందిన జైన్‌ మహావీర్‌ ట్రస్ట్‌దే పూర్తి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్మన్‌ శంకరయ్య, వైస్‌చైర్మన్‌ మొరిగాడి మాధవి, కౌన్సిలర్లు బేతి రాములు, కందుల శ్రీకాంత్‌, రాయపురం నర్సింహులు, దయామణి, సింగిల్‌విండో డైరెక్టర్‌ గవ్వల న ర్సింహులు, గంగుల శ్రీనివాస్‌, మొరిగాడి వెంకటేష్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ మామిడాల నర్సింహులు, ఎంపీటీసీ జూకంటి అనిల్‌, సర్పంచ్‌లు  మహేందర్‌రెడ్డి, లక్ష్మీప్రసాద్‌రెడ్డి, రాంప్రసాద్‌, పాండరి, పద్మ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T11:19:24+05:30 IST