మద్యం విక్రయిస్తే రూ.50వేల జరిమానా
ABN , First Publish Date - 2020-03-24T11:58:59+05:30 IST
మండలంలోని మహ్మదపురంలో మద్యం, విక్రయించినా, కొనుగోలు చేసినా రూ.50వేళ జరిమానా విధిస్తున్నట్లు

పెన్‌పహాడ్, మార్చి 23: మండలంలోని మహ్మదపురంలో మద్యం, విక్రయించినా, కొనుగోలు చేసినా రూ.50వేళ జరిమానా విధిస్తున్నట్లు సోమవారం గ్రామపంచాయతీ తీర్మానించింది. గ్రామంలో మద్యం విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని, పంచాయతీ సర్వసభ్య సమావేశంలో పాలకవర్గం సూచించింది. దీంతో గ్రామంలో మద్యం, బెల్టు షాపులు బంద్ చేయాలని, నిర్ణయించింది. సర్పంచ్ రజనీసుధాకర్, ఉపసర్పంచ్ వెంకన్న, నాగమణి, భద్రమ్మ, అంజయ్య, ధనమ్మ, లాలు, సైదులు, సిబ్బంది పాల్గొన్నారు.