శిక్షణ.... నిరీక్షణ.. టీఎస్ ఎస్పీకి ఎంపికై తొమ్మిది నెలలు

ABN , First Publish Date - 2020-08-11T17:28:04+05:30 IST

పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదివి, ఏళ్ల తరబడి సాధన చేశారు. అనుకున్నది సాధించి, ఉద్యోగానికి ఎంపికై తొమ్మిది నెలలు గడిచినా శిక్షణ ప్రారంభం కాలేదు. దీంతో టీఎస్ ఎస్పీ (తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌) అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

శిక్షణ.... నిరీక్షణ.. టీఎస్ ఎస్పీకి ఎంపికై తొమ్మిది నెలలు

పట్టించుకోని ప్రభుత్వం, పోలీసు అధికారులు

ఉమ్మడి జిల్లాలో 1,400మంది ఎదురుచూపులు

వివిధ ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్న అభ్యర్థులు


నల్లగొండ(ఆంధ్రజ్యోతి): పోలీస్‌ ఉద్యోగం సాధించాలనే  పట్టుదలతో కష్టపడి చదివి, ఏళ్ల తరబడి సాధన చేశారు. అనుకున్నది సాధించి, ఉద్యోగానికి ఎంపికై తొమ్మిది నెలలు గడిచినా శిక్షణ ప్రారంభం కాలేదు. దీంతో టీఎస్ ఎస్పీ (తెలంగాణ స్పెషల్‌ పోలీస్‌) అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగం వచ్చింద న్న సంతోషంలో ప్రైవేటు ఉద్యోగాన్ని మా నేసినవారు పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్తున్నారు. ఫిట్‌నెస్‌ గా ఉండాల్సినవారు పలు ప్రమాదాల్లో గాయాలపాలవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం పోలీస్‌ ఉద్యోగాల భర్తీ కోసం 17,156 పోస్టులకు 2018, మే 31న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అదే ఏడాది సెప్టెంబరు 30వ తేదీన ప్రిలిమ్స్‌, 2019 ఫిబ్రవరి, మార్చి నెలల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించింది. 2019, ఏప్రిల్‌ 28న మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించి సెప్టెంబరు 24న ఫలితాలు విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు మెడికల్‌ టెస్టులు, ఎస్‌బీ ఎంక్వైరీ 2019 అక్టోబరు నెలలో నిర్వహించింది. అయితే సివిల్‌, ఏఆర్‌, ఎస్‌పీఎఫ్‌, జైలువార్డెన్‌, సివిల్‌ ఎస్‌ఐ విభాగాల్లో ఎంపికైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 16న రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణ ప్రారంభించింది. టీఎ్‌సఎస్పీ అభ్యర్థులను మాత్రం నేటికీ శిక్షణకు పిలవకపోవడంతో ఉద్యోగాలకు ఎంపికైనవారు ఆందోళన చెందుతున్నారు. టీఎ్‌సఎస్పీ విభాగానికి ఎంపికైనవారు రాష్ట్ర వ్యాప్తంగా 4203 మంది అభ్యర్థులు ఉన్నారు.


పలువురికి గాయాలు

పోలీస్‌ శాఖ అంటే ఫిట్‌నెస్‌ ప్రధానం. ఈ శాఖలో ఉద్యోగానికి ఎంపిక కావాలంటే ఫిట్‌నెస్‌ ప్రామాణికం. ఈ ఉద్యోగానికి ఎంపికైన టీఎస్ ఎస్పీ అభ్యర్థులు శిక్షణ ప్రారంభంకాకపోవడంతో ఫిట్‌నెస్‌ కోల్పోయే ప్రమాదం ఉంది. ఉద్యోగం వచ్చినా శిక్షణ, వేతనాలు లేకపోవడంతో పేదకుటుంబాలకు చెందిన అభ్యర్థులు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది అభ్యర్థులు అనారోగ్యంబారిన పడుతున్నారు. అంతేగాక పలు ప్రమాదాల్లో క్షతగాత్రులవుతున్నారు. కొందరికి కాళ్లు, చేతులు సైతం విరిగి చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఐదుగురు టీఎ్‌సఎస్పీ అభ్యర్థులు వివిధ ప్రమాదాల్లో మృతి చెందినట్టు సమాచారం. పోలీసు ఉద్యోగం రావడంతో ప్రైవేటు ఉద్యోగాలు చేసేవారు వాటిని బంద్‌ చేశారు. నెలలు గడుస్తుండటంతో వారు పొట్టకూటికోసం కూలీకి వెళ్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన శిక్షణ ప్రారంభించి ఆదుకోవాలని అభ్యర్థులను కోరుతున్నారు.


ఉమ్మడి జిల్లాలో 1400 మంది

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1400 మంది అభ్యర్థులు టీఎస్ ఎస్పీ కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎం పికయ్యారు. వీరికి ఇప్పటికే శిక్షణ పూర్తి కావల్సి ఉండ గా, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. టీఎ్‌సఎస్పీమినహా సివిల్‌, ఏఆర్‌తో పాటు వివిధ విభాగాల్లో పోలీస్‌ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఇప్పటికే శిక్షణ ప్రారంభమై మరో రెండు నెలల్లో పూర్తికానుంది. వీరితో పోల్చుకుంటే శిక్షణ ప్రా రంభంకాని టీఎ్‌సఎస్పీ అభ్యర్థులు సర్వీసు, వేతనాన్ని కోల్పో యే ప్రమాదం ఉంది. అంతేగాక సీనియారిటీలో వెనుకపడనున్నారు. టీఎ్‌సఎస్పీ శిక్షణ తేదీలను ప్రభుత్వంగా నీ, టీఎ్‌సఎల్‌పీఆర్‌బీగానీ ఖరారు చేసి సర్వీ సు, వేతనాలు, సీనియారిటీపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.


శిక్షణ ప్రారంభంకాక కూలీకి వెళ్తున్నా:  - టీఎస్ ఎస్పీ అభ్యర్థి, నల్లగొండ

చిన్నప్పటి నుంచి పోలీస్‌ కావాలన్నది నా కల. అప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకుంటున్నా. పోలీస్‌ ఉద్యోగానికి ఫిట్‌నెస్‌ కోసం ప్రతి రోజూ ఉదయం 4గంటల నుంచే గ్రౌండ్‌ కు వెళ్లి సాధన చేశా. చివరికి టీఎ్‌సఎస్పీ విభాగానికి ఎంపికయ్యా. తొమ్మిది నెలలు అవుతున్నా నేటికీ శిక్షణ ప్రారంభం కాలేదు. దీంతో కూలీకి వెళ్లి కుటుంబానికి చేదోడుగా ఉంటున్నా. ప్రభుత్వం వెంటనే శిక్షణ ప్రారంభించి నాలాంటి వారిని ఆదుకోవాలి.

Updated Date - 2020-08-11T17:28:04+05:30 IST