ఘనంగా సీత్లా పండుగ

ABN , First Publish Date - 2020-07-08T10:09:21+05:30 IST

జిల్లావ్యాప్తంగా గిరిజనులు మంగళవారం సీత్లా పండుగను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా సీత్లా పండుగ

సూర్యాపేట, జూలై 7: జిల్లావ్యాప్తంగా గిరిజనులు మంగళవారం సీత్లా పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామశివారుల్లోని దేవతల వద్ద నారబుట్టలను ఉంచి నృత్యాలు ఆడారు. ఆనందోత్సాహాల మధ్య వేడుకలు జరిగాయి. అర్వపల్లి మండలం  తూర్పుతండా, సూర్యనాయక్‌తండా, గణ్యానాయక్‌తండా, పడమటితండా గ్రామాల్లో పండుగ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బిక్కునాయక్‌, ఉపసర్పంచ్‌ సుజాత, కేతావత్‌ పద్మ, శ్రీను, బాలు, పాచ్యా పాల్గొన్నారు.  ఆత్మకూర్‌(ఎస్‌) మండలం బోట్యాతండా, పాశంబండా తండాల్లో పండుగను ఘనంగా నిర్వహించారు. మునగాల మండలం సీతానగరంలో పంటలు బాగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గ్రామపెద్దలు బాదావత్‌ శేఖర్‌, సైదులు, శంకర్‌, హుస్సేన్‌, జానకిరాము లు, కోటేశ్వరరావు పాల్గొన్నారు. చింతలపాలెం మం డలం గాంధీనగర్‌లో సేవాలాల్‌ బంజారా సంఘం జిల్లా యూత్‌ అధ్యక్షుడు రవినాయక్‌, సర్పంచ్‌ అరు ణ, సామ్లానాయక్‌ పాల్గొన్నారు.


అనంతగిరి మండలంలోనూ వేడుకలు నిర్వహించారు. నడిగూడెం మండలం ఈకేపేటతండాలో మహిళలు, యువతీ, యువకులు ఆటపాటలతో ప్రసాదాలు, నైవేధ్యాలను ఊరేగింపుగా గ్రామదేవతల వద్దకు తీసుకెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఎల్‌హెచ్‌పీఎ్‌స రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ధరావత్‌ వెంకటరమణ, నాయక్‌ యూత్‌ అధ్యక్షుడు ఉపేందర్‌, మల్సుర్‌, లక్ష్మణ్‌, బాలునాయక్‌, రాంబాబు పాల్గొన్నారు.  తిరుమలగిరి మండలం మర్రికుంటతండా, మొండిచింతతండా, కోట్యతండా, సిద్ధిసముద్రంతండాలలో సీత్లా పండుగను నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు దేవ, మోహన్‌బాబు, హైమావతీరామోజీ, రవీందర్‌ పాల్గొన్నారు. నూతన్‌కల్‌ మండలం సోమ్లాతండా, టీ క్యాతండా, బక్కహేమ్లాతండాల్లో జరిగిన కార్యక్రమంలో మహిళలు, ప్రజా ప్రతినిధులు, పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-08T10:09:21+05:30 IST