మంటలు చూసి.. కారు దిగి
ABN , First Publish Date - 2020-12-20T05:12:04+05:30 IST
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది.

మునగాల, డిసెంబరు 19 : హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఈ ఘటన మండలంలోని ఆకుపాముల వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా రేపల్లె చెందిన రతన్‌శెట్టి బాలు, అతని బావ సురేంద్రనాథ్ బెనర్జీలు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. మండలంలోని ఆకుపాముల గ్రామ వద్దకు రాగానే ఓవర్ హీట్‌తో కారులో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు వ్యాపించాయి. గ్రహించిన వెంటనే కారులోని ఇద్దరూ బయటకు వచ్చారు. ఫైర్‌స్టేషన్‌కు సమాచారం చేరవేరడంతో వారు ఫైర్‌సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు.