పేదలకు అండగా పథకాలు

ABN , First Publish Date - 2020-12-20T05:23:00+05:30 IST

రైతుబంధు, రైతుబీమా, పాడిపరిశ్రమ వంటి ప్రభుత్వ పథకాలు పేదలకు అండగా ఉంటాయని పశువైద్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు.

పేదలకు అండగా పథకాలు
ఉచిత మెగా పశువైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ 

మునగాల, డిసెంబరు 19: రైతుబంధు, రైతుబీమా, పాడిపరిశ్రమ వంటి ప్రభుత్వ పథకాలు పేదలకు అండగా ఉంటాయని పశువైద్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమశాఖ మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని ఆకుపాముల గ్రామంలో ఉచి త మెగా పశువైద్య శిబిరం, మేలుజాతి దూడల ప్రదర్శనను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన ప్రతి ప్రభుత్వ పథకం గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతం వరకు పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికి దోహదపడుతున్నా యన్నారు. గాయపడిన మూగజీవాల రక్షణకు ప్రభుత్వం వెంటనే చికిత్స అందిస్తోందన్నారు. గోపాలమిత్రులకు ప్రతినెలా రూ.8,500 వేతనం ఇస్తున్నట్లు తెలిపారు. పాడిపంట, రైతాంగం అభివృద్ధి కోసం కృషి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనితా రాజేంద్ర, కలెక్టర్‌ వినయ్‌ కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌, కార్యనిర్వహణాధికారి మంజువాణి, సంచాలకులు లక్ష్మారెడ్డి, ఎంపీపీ ఎలుక బిందునరేందర్‌రెడ్డి, జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల శ్రీనివాస్‌, సర్పంచ్‌ కేశగాని వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

అవినీతిలేని రిజిస్ర్టేషన్‌లు చేపట్టడమే ధరణి ఉద్దేశం 

రాష్ట్రంలో అవినీతిలేని రిజిస్ర్టేషన్‌లు చేపట్టడమే ధరణి ప్రధాన ఉద్దేశమని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ అన్నారు. వైద్య శిబిరాన్ని ప్రారంభించిన తర్వాత విలేకరులతో మాట్లాడారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో బీజేపీ మతకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఒక్క ఎమ్మెల్యే, జీహెచ్‌ఎంసీలో కొన్ని సీట్లు వచ్చిన బీజేపీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను విమర్శించడం తగదన్నారు. వరద బాధితుల కుటుంబాలకు రూ.25వేల ఇస్తామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన బీజేపీ, కేంద్ర ప్రభుత్వం నుంచి వరద బాధితులకు ఏమైన సాయం చేసిం దా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలే పేదలకు అండగా ఉంటున్నాయన్నారు. 

Updated Date - 2020-12-20T05:23:00+05:30 IST