సంతో్‌షబాబు సేవలు రాష్ట్రానికి గర్వకారణం

ABN , First Publish Date - 2020-06-22T11:19:36+05:30 IST

దేశ రక్షణ కోసం కల్నల్‌ సంతో్‌షబాబు చేసిన సేవలు రాష్ట్రానికి గర్వకారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు.

సంతో్‌షబాబు సేవలు రాష్ట్రానికి గర్వకారణం

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి


సూర్యాపేట(ఆంధ్రజ్యోతి): దేశ రక్షణ కోసం కల్నల్‌ సంతో్‌షబాబు చేసిన సేవలు రాష్ట్రానికి గర్వకారణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో సంతో్‌షబాబుకు నివాళులర్పించి, ఆయన కుటుంబ సభ్యులను చాడా పరామర్శించారు. అనంతరం జిల్లా కేంద్రంలోని సీపీఐ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. దేశ సరిహద్దుల్లో వీరజవాన్లు మృతిచెందడం బాధాకరమన్నారు. భారత్‌-చైనా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రధాని మోదీ చర్చలు జరపాలన్నా రు. కరోనా వైర్‌సను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. కేసులు పెరుగుతున్నా సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్‌ పేరుతో రూ.20లక్షల కోట్లు ప్రకటించగా, అందులో రక్షణ, రైల్వే, బ్యాంకింగ్‌, ప్రైవేట్‌ రంగానికే రూ.16లక్షల కోట్ల కేటాయించారన్నారు.


మిగిలిన కొద్దిపాటి నిధులు పేదలకు ఏమాత్రం సరిపోవన్నారు. లాక్‌డౌన్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఒకేసారి మూడు నెలల విద్యుత్‌ బిల్లు భారాన్ని మోపడం దారుణమన్నారు. వలస కార్మికులకు సహాయం అందించడం లో ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. ఆయన వెంట పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, నాయకులు పశ్య పద్మ, బొమ్మగాని ప్రభాకర్‌, కేవీఎల్‌, పట్టణ కార్యదర్శి దోరేపల్లి శంకర్‌, బొమ్మగాని శ్రీనివా్‌సగౌడ్‌, బూర వెంకటేశ్వర్లు, అశోక్‌, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - 2020-06-22T11:19:36+05:30 IST