సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి

ABN , First Publish Date - 2020-12-13T05:37:56+05:30 IST

సీఎం కేసీఆర్‌ పేదలకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు.

సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌

 దేవరకొండ ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌
కొండమల్లేపల్లి, డిసెంబరు 12 :
సీఎం కేసీఆర్‌ పేదలకు అందించే సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ అన్నారు. శనివారం ఆయన తహసీల్దార్‌ కార్యాలయంలో 39మంది లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లతో పాటు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎవరూ బాల్య వివాహాలను చేయవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సరస్వతి, మార్కెట్‌ చైర్మన్‌ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, వైస్‌ఎంపీపీ కాసర్ల వెంకటేశ్వర్లు, జడ్పీటీసీ  పసునూరి సరస్వతమ్మ, కొండమల్లేపల్లి ఉప సర్పంచ్‌ సురేష్‌, సర్పంచ్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-13T05:37:56+05:30 IST